MLC Kavitha | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దుర్గామాత ఆశీస్సులతో శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నట్టు ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. స్త్రీ శక్తి విజయానికి సూచిక విజయ దశమి. మహిళా జయానికి ప్రతిబింబం అని చెప్పారు.
తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నం దసరా అని అన్నారు. జమ్మి ఆకులను బంగారంగా భావించి అలయ్ బలయ్ తీసుకోవడం, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక.
తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు అందరిపై ఉండాలనీ, సుఖ సంతోషాలను ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నాను అని కవిత పేర్కొన్నారు.
దుర్గామాత ఆశీస్సులతో శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
స్త్రీ శక్తి విజయానికి సూచిక విజయ దశమి. మహిళా జయానికి ప్రతిబింబం.
తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరా కు ప్రత్యేక స్థానం ఉంది. విజయానికి చిహ్నం దసరా. జమ్మి ఆకులను… pic.twitter.com/Xr2I2xxvNd
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 23, 2023