MLC Kavitha | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తి కేటాయింపు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. శాసనమండలిలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రానున్న ఐదేండ్ల ప్రణాళికకు సంబంధించి బడ్జెట్ లేదన్నారు. ఎన్నికల హామీ గురించి బడ్జెట్లో చెప్పలేదని అడిగారు. పాత పేర్లను తీసేసి కొత్త పేర్లు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ ఛేంజింగ్.. మాత్రమే, గేమ్ ఛేంజర్ కాదు అని కవిత విమర్శించారు.