BRS MLAs | సచివాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు.. యూరియా కొరతపై ధర్నా
BRS MLAs | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నారు.
BRS MLAs | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూనే ఉన్నారు.
ఇవాళ కూడా వ్యవసాయ శాఖ కమిషనర్‌కు యూరియా కొరతను తక్షణమే తీర్చాలంటూ రైతుల తరపున బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. “రేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
యూరియా కొరతపై తెలంగాణ సచివాలయం వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు https://t.co/1U8uEl3M8A pic.twitter.com/iLNPyo0Aaw
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

