అమరులకు నివాళులర్పించి అసెంబ్లీకి..
శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు మంగళవారం గన్‌పార్క్ వద్ద అమరువీరుల స్తూపానికి నివాళులర్పించారు. ‘జై తెలంగాణ’, ‘అమరవీరులకు జోహ ర్లు’ నినాదాలతో హోరెత్తించారు.
- తొలిరోజు గులాబీ కండువాలతో సభలోకి
- గన్‌పార్క్‌వద్ద ‘జై తెలంగాణ’, ‘అమరవీరులకు జోహార్లు’
- నినాదాలతో హోరెత్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు మంగళవారం గన్‌పార్క్ వద్ద అమరువీరుల స్తూపానికి నివాళులర్పించారు. ‘జై తెలంగాణ’, ‘అమరవీరులకు జోహ ర్లు’ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుం చి నడుచుకుంటూ అసెంబ్లీకి చేరుకున్నారు. అందరూ గులాబీ కండువాలు కప్పుకొని అసెంబ్లీలో కూర్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్య చివరి వరుసలో కూర్చున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇదా గది? : కేటీఆర్ అసంతృప్తి
ప్రధాన ప్రతిపక్ష నేతలకు కేటాయించిన గదిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది కనీసం కూర్చోవడానికి కూడా అనువుగా లేదని చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతకు ఇచ్చిన గౌరవం, మర్యాదను కాంగ్రెస్ ప్రభుత్వం పాటించడం లేదని, ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. సౌకర్యవంతంగా ఉండే గదిని కేటాయించాలని స్పీకర్‌ను కోరారు.
సంప్రదాయం, ఆనవాయితీని పాటించరా: హరీశ్‌రావు
ప్రతిపక్షంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపించింది. బీఏసీ సమావేశానికి ఆహ్వానాన్ని కూడా సరిగా పంపలేదని విమర్శించింది. గతంలో ఉన్న సంప్రదాయం, ఆనవాయితీని పాటించడంలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి టీ హరీశ్‌రావు బీఏసీకి హాజరుకావాలని పార్టీ నిర్ణయించగా సమావేశం ఎన్ని గంటలకనే సమాచారాన్ని, ఆహ్వానాన్ని అసెంబ్లీ అధికారులు అందించలేదు. చివరి నిమిషంలో అధికారులు వచ్చి బీఏసీ సమావేశానికి రావాలని చెప్పడంతో వారిపై హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. గతంలో సభ జరుగుతున్నప్పుడు శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి ప్రతిపక్ష నేత వద్దకు వచ్చి చెప్పే వారని, కానీ ఇప్పుడు ఇవేవీ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

