Lasya Nanditha | లాస్య నందిత కారు ప్రమాదానికి అసలు కారణం అదేనా?
ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు శేఖర్ అనే డ్రైవర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో శేఖర్‌కు బదులు మరో వ్యక్తి డ్రైవింగ్ చేశారు. తాజాగా శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలోనూ శేఖర్ డ్రైవింగ్ చేయలేదు. శుక్రవారం లాస్య నందిత కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న వాహనాన్ని శేఖర్ డ్రైవింగ్ చేయగా, ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆకాశ్ నడిపాడు.
- అసలు డ్రైవర్‌ను పక్కనబెట్టడంతోనే..!
Lasya Nanditha | హైదరాబాద్ సిటీబ్యూరో/కంటోన్మెంట్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు శేఖర్ అనే డ్రైవర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో శేఖర్‌కు బదులు మరో వ్యక్తి డ్రైవింగ్ చేశారు. తాజాగా శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలోనూ శేఖర్ డ్రైవింగ్ చేయలేదు. శుక్రవారం లాస్య నందిత కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న వాహనాన్ని శేఖర్ డ్రైవింగ్ చేయగా, ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆకాశ్ నడిపాడు.
లాస్య నందితకు దగ్గరి బంధువైన పీయూష్ రాఘవ అలియాస్ ఛోటు ద్వారా ఆకాశ్.. ఎమ్మెల్యే వద్ద పనిలో చేరాడు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ సెలెక్షన్లలో ఉద్యోగం కోసం ఎంపికయ్యాడు. ఇతనితో ఎంపికైన వారికి ఇటీవలే కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమైంది. తాను రెండో బ్యాచ్‌లో శిక్షణకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఆకాశ్‌కు కారు డ్రైవింగ్ అంతంత మాత్రమే వచ్చని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడం, ఆ సమయంలో వేగాన్ని నియంత్రించలేకపోవడంతో యువ ఎమ్మెల్యే ప్రమాదంలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

