CM KCR | కేసీఆర్ ఒక్కరుంటే చాలు.. రాబోయే ఎన్నికల్లో మెజారిటీ గెలుపు మాదే.. బీఆర్ఎస్ అభ్యర్థుల ధీమా ఇదీ!
CM KCR | ‘ఎటువంటి గజబలంగానీ, రథబలంగానీ, అశ్వబలంగానీ, వందలాది అక్షౌహిణుల సైన్యంగానీ మాకు వద్దేవద్దు.. మావైపున ఒక్క కృష్ణుడుంటే చాలు.. మా విజయం ఖాయం’ అని నాడు పాండవులు కోరుకున్నట్టు.. తమకు కేసీఆర్ ఒక్కరుంటేచాలు, లక్షల అక్షౌహిణులతో సమానం.. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు, హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు కేసీఆరే మా బలం బలగం అనే భరోసాను, ధీమాను, విశ్వాసాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు.
CM KCR | ‘ఎటువంటి గజబలంగానీ, రథబలంగానీ, అశ్వబలంగానీ, వందలాది అక్షౌహిణుల సైన్యంగానీ మాకు వద్దేవద్దు.. మావైపున ఒక్క కృష్ణుడుంటే చాలు.. మా విజయం ఖాయం’ అని నాడు పాండవులు కోరుకున్నట్టు.. తమకు కేసీఆర్ ఒక్కరుంటేచాలు, లక్షల అక్షౌహిణులతో సమానం.. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు, హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు కేసీఆరే మా బలం బలగం అనే భరోసాను, ధీమాను, విశ్వాసాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. గెలుపు పట్ల బీఆర్ఎస్-2023’ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో విశ్వాసం గ్రాఫ్ రాకెట్లా దూసుకుపోతున్నది. అధినేత తమను మళ్లీ గుర్తించడంతో వారిలో గెలుపు తాలూకు నమ్మకం పెరిగిపోయింది. సిట్టింగులకే సీట్లిస్తామని ప్రకటించిన సీఎం, తన మాట నిలబెట్టుకోవడంతో అభ్యర్థులు ఉబ్బితబ్బిబ్బవుతూ అధినేతను కలసి తమ కృతజ్ఞతాభివందనాలు తెలుపుకొంటున్నారు.
అభ్యర్థుల జాబితా విడుదల చేసిన మరుక్షణం నుంచి మొదలైన వారి ధన్యవాదాల వెల్లువ మంగళవారం కూడా కొనసాగింది. పూల బొకేలు, శాలువాలతో ప్రగతిభవన్ చేరుకున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ఆయా జిల్లాల నేతలతో ప్రగతి భవన్లో సందడి నెలకొన్నది. కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకొంటూ, భుజం మీద చేతులు వేయించుకొని ఫొటోలు దిగుతూ ధన్యవాదాలు తెలుపుకొంటున్నారు. భరోసాను పొందుతున్నారు. ఎన్నికల్లో హాట్రిక్ విజయం సాధించి తమ నాయకుడిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేసేందుకు సన్నద్ధులవుతూ ముందుకు సాగుతున్నారు.
నమ్మశక్యంకాని విషయం
ఎన్నడూ ప్రకటించని రీతిలో ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం, భారతదేశ ఎన్నికల చరిత్రలోనే సీఎం కేసీఆర్ సృష్టించిన అరుదైన రికార్డు. దేశ రాజకీయ చరిత్రలోనే నభూతో అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అందులో వందమందిదాకా సిట్టింగులే కావడం, ఇంకా అందులో మెజార్టీ అభ్యర్థులు మూడోసారి కూడా అధినేత మనసు గెలవడం మరో గొప్ప విషయం.
ఇప్పటికే అనేక అంశాల్లో నంబర్ వన్‌గా నిలిచి చరిత్ర సృష్టిస్తున్న కేసీఆర్ మాడల్ పాలన, ఎన్నికల రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ, రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలవడం తెలంగాణకే కాదు దేశానికే గర్వ కారణంగా నిలిచింది.
ఇస్రో చంద్రయాన్ – 3 విజయవంతంగా సేఫ్ ల్యాండింగ్ జరిగే ప్రక్రియకన్నా ఒక్కరోజు ముందే తెలంగాణ చంద్రయాన్ విజయవతంగా సేఫ్‌ల్యాండింగ్ అయింది. అభ్యర్థుల జాబితా విడుదల ప్రక్రియతో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కక్ష్యలోని ముఖ్యఘట్టం ల్యాండింగ్ జరిగింది. ఎలాంటి ఆందోళనలు లేకుండానే, కుదుపులకు లోనుకాకుండానే సేఫ్ ల్యాండింగ్ కావడం ద్వారా తెలంగాణ ప్రజల మనసులను గెలిచింది. తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఫలితాలను రాబట్టడం అనే ప్రక్రియను ఈ సేఫ్ ల్యాండింగ్ నల్లేరు మీద నడకగా మార్చేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అనే ఊసును కూడా ఈ అభ్యర్థుల ప్రకటన ఊడ్చేసింది. అభ్యర్థుల ప్రకటన గాలిలో ప్రతిపక్షాలు తేలిపోయాయి. యుద్ధాన్ని ప్రారంభించక ముందే బీఆర్ఎస్ శంఖారావ ప్రతిధ్వని ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపింది. యుద్ధం చేయకముందే ప్రత్యర్థిని ఓడించిన దార్శనికతతో, అత్యంత సూక్ష్మజ్ఞానంతో కూడిన సైద్ధాంతిక, తాత్వికతతో కేసీఆర్ ప్రదర్శించిన రాజనీతికి దేశ రాజకీయ విమర్శక లోకం జేజేలు పలుకుతున్నది. -సహస్ర
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

