నల్లగొండ జిల్లా : గురువారం ఉదయం నాగార్జున కళాశాల మైదానంలో బీఆరెస్ నేతల రాకతో పొద్దుపొద్దున్నే సందడిగా, ఆత్మీయంగా మారింది. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆరెస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాజీ నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు నగర కార్పొరేటర్లు, పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు నాగార్జున కళాశాల మైదానంలో పర్యటించారు.
మైదానంలో ఉన్న వాకర్స్, మిత్రులు, శ్రేయోభిలాషుల్లో వారికీ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అంతా ఓట్లు నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసారు. వచ్చే ఎన్నికల్లో పట్టభద్రుల గొంతుకగా నిలిచే బీఆరెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. మైదానం అంటే కేవలం వ్యాయామం చేసే ప్రదేశం కాదంటూ ఆత్మీయతలు కలిసే వేదికగా స్నేహాలు బలపడే ప్రదేశంగా ఎన్జీ కాలేజ్ మైదానం ఉండడం ఎంతో సంతోషమన్నారు. నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ సందర్బంగా బీఆరెస్ నేతలను ఘనంగా సన్మానిస్తూ, స్వాగతం పలికారు.