BRS | నిందితుడు రేవంత్ కనుసన్నల్లో పోలీసులు..
రాష్ట్ర ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్నందున, ఆయన కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నందున ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్ కోర్టుకు బదిలీచేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై వారి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. ‘నిందితుడే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికార పదవిలో ఉన్నారు.
- ఓటుకు నోటు కేసును భోపాల్‌కు బదిలీ చేయండి
- బీఆర్ఎస్ నేతల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదన
BRS | ఢిల్లీ, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్నందున, ఆయన కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నందున ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్ కోర్టుకు బదిలీచేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై వారి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. ‘నిందితుడే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికార పదవిలో ఉన్నారు. నిందితుడి ఆధీనంలోనే కేసు దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నది. నిందితుడిపై తీవ్ర నేరాభియోగాలకు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటి కీలక కేసులో నిందితుడిపై అభియోగాలు కోర్టులో నిలబడాలంటే.. ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్‌కు మార్చాలి’ అని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఈ ఏడాది జనవరి 31న సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కాపీ గత రాత్రే అందిందని, దానిపై తమ వాదనలతో కూడిన రీజాయిండర్ దాఖలుచేయడానికి రెండు వారాల సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉన్నారని, పోలీసులు సీఎం ఆదేశాల మేరకే పనిచేస్తారని, ఈ కేసులో కీలక ఆధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. దేశంలోని ఉన్నతస్థాయిలోని వ్యక్తులపై అభియోగాలు విచారణ చేయాలంటే ఆ కేసులను పాకిస్తాన్‌కో, శ్రీలంకకో బదిలీ చేయాలా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఉన్నత స్థాయిలోని వ్యక్తులు కోర్టులను ప్రభావితం చేయగలరా? అని ప్రశ్నించింది. గతంలో జయలలిత కేసును తమిళనాడు నుంచి బెంగళూరుకు బదిలీచేసిన సందర్భాలు ఉన్నాయని, ఇతర పలు కేసుల్లో కూడా సుప్రీంకోర్టు కేసును బదిలీ చేసిందని న్యాయవాది గుర్తుచేశారు. కోర్టులను ప్రభావితం చేస్తారని కాదని, కేసులో కీలక ఆధారాలు సమర్పించాల్సిన పోలీసులు సీఎం కనుసన్నల్లోనే పనిచేస్తారని, దీనికితోడు సీఎంగా ఉన్న వ్యక్తి నిందితుడిగా ఉన్నప్పుడు సాక్షులు ధైర్యంగా ముందుకు రాలేరని జవాబు చెప్పారు. ప్రభుత్వ కౌంటర్‌పై రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలుచేయాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. కేసును భోపాల్‌కు బదిలీచేయాలనే ప్రధాన అంశంపై ధర్మాసనం పూర్తి విచారణ తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేయనున్నది.
నిందితుడే ప్రభుత్వ నిర్ణయాధికారి
‘తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో తనపై 88 కేసులు ఉన్నట్టు రేవంత్‌రెడ్డి స్వయంగా ఎన్నికల అఫిడవిట్లో పేరొన్నారు. పోలీస్ అధికారులను బెదిరించారు. ఓటుకు నోటు క్రిమినల్ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ ఇప్పుడు సీఎం అయ్యారు. సాక్షులు కేసు విచారణ సజావుగా జరిగేందుకు సహకరించరు. ఈ కేసులో అనేక కీలక సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. ఇవన్నీ కోర్టులో నిరూపణ అవ్వాలంటే కేసు విచారణ తెలంగాణ కోర్టును నుంచి భోపాల్ కోర్టుకు బదిలీచేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంపీగా, ఎమ్మెల్యే స్థాయిలోనే రేవంత్‌రెడ్డి పోలీసులను బట్టలు ఊడదీస్తామంటూ బెదిరించారు. తిమ్మిరెకిందా..ఏమనుకుంటున్నారు.. అనే స్థాయిలో దూషణలకు దిగారు. అలాంటి రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నందున ఓటుకు నోటు కేసులో దోషులు ఎవరో తేలాలంటే కేసును భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలి. రేవంత్‌రెడ్డి దగ్గరే హోంశాఖ కూడా ఉన్నది. పోలీసులు, ఏసీబీ, డెరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, ఫొరెన్సిక్ వంటివి హోంశాఖలో అంతర్భాగం. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిపై కీలక అభియోగాలు నిరూపణ కావాలంటే.. భోపాల్‌లోని డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టుకు ఓటుకు నోటు కేసును బదిలీ చేయాలి’ అని పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

