BRS Leaders Arrest | యూరియా కోసం ధర్నా.. బీఆర్ఎస్ నేతలు అరెస్ట్
BRS Leaders Arrest | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
BRS Leaders Arrest | హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయా పోలీసు స్టేషన్లకు వారిని తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అంతకుముందు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినతిపత్రం అందించారు. యూరియా కొరత తీర్చాలని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కమిషనర్‌కు బీఆర్ఎస్ నేతలు సూచించారు. మేం రాజకీయాలు చేయడం లేదు.. రైతుల తరపున మాట్లాడుతున్నాం అని కమిషనర్‌కు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. “రేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
యూరియా కావాలని రైతుల పక్షాన ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ సీనియర్ నాయకులను అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయంలో అరెస్టు చేసి, తరలించిన పోలీసులు. pic.twitter.com/iI35XzfpVE
— BRS Party (@BRSparty) August 30, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

