RSP | అంతా ‘బహిరంగమే’.. కాంగ్రెస్ పాలనలో దోపిడీ కూడా పారదర్శకమే : ఆర్ఎస్పీ
RSP | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతా బహిరంగమే.. కాంగ్రెస్ పాలనలో దోపిడీ కూడా పారదర్శకమే అని రేవంత్ సర్కార్ను ఉద్దేశించి ఆర్ఎస్పీ విమర్శించారు.
RSP | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతా బహిరంగమే.. కాంగ్రెస్ పాలనలో దోపిడీ కూడా పారదర్శకమే అని రేవంత్ సర్కార్ను ఉద్దేశించి ఆర్ఎస్పీ విమర్శించారు.
రేవంత్ రెడ్డి గారూ.. బీజేపీకి చెందిన ఒక ఆంధ్ర ప్రాంతపు అగ్ర ఎంపీ సీఎం రమేష్ కంపెనీకి మీకు అత్యంత ఇష్టమైన ఫ్యూచర్ సిటీ(Four Brothers City అంటున్నరు కొందరు) రోడ్ల కాంట్రాక్టు బహిరంగంగానే వచ్చిందా? ఎవరి చెవులల్ల పూలు పెడ్తున్నరు? అని ప్రశ్నించారు.
మీరు ‘కట్టర్’ కాంగ్రెస్ – ఆయనేమో బీజేపీ, మీరేమో పాలమూరు పులి బిడ్డ.. ఆయనేమో కడప బట్టమేక పిట్ట.. ష్ ష్…మీకు అమిత్ షా గారు చెప్పలేదు, మేము చూడ లేదు. పాపం రాహుల్ గాంధీ జీ..! అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
కొడంగల్-నారాయణపేట రూ. 4000 కోట్ల ఎత్తిపోతలు-ఎక్సెస్ లూ బహిరంగమే.. వాటిని మెగా కృష్ణారెడ్డికి, రాఘవ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వడమూ పారదర్శకమే. ‘ఉత్తమ’ నీటిపారుదలలో రూ. 1500 కోట్ల ముత్యాల బ్రాంచ్ కాలువ ఆంధ్ర ‘రాయల్ వెంకట్ రావు’ చేజిక్కించుకోవడం బహిరంగమే. నల్గొండలో ఆఘమేఘాల మీద రూ. 400 కోట్ల రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ఖమ్మం శ్రీధర్ రెడ్డికి అప్పనంగా అప్పగింత పారదర్శకమే. కోదాడలో రూ. 5 కోట్ల రాజీవ్ లిఫ్ట్ లు రాత్రికి రాత్రి రూ. 50 కోట్లు కావడం సాధారణమే-బహిరంగమే. ఉదయ సముద్రం పారదర్శకమే.. అన్నీ కాంట్రాక్టులు కేవలం అగ్రవర్ణాల్లో సంపన్నులకే ఇవ్వాలనుకున్నపుడు, కామారెడ్డి-చేవెళ్ల డిక్లరేషన్లు ఎందుకు చేసిండ్రు?? అని ఆర్ఎస్పీ నిలదీశారు.
అంటే తెలంగాణ బహుజనులు ఎప్పుడూ కల్లు-బర్రె-గొర్రె-బియ్యం-రాయి-జైలు-బెయిలు-బేడీ-బీడీ-డప్పు-చెప్పుల చుట్టే తిరగాల్నా? తెలంగాణ బహుజనులు మీ లాగా కాంట్రాక్టులకు అర్హులు కానే కారా? అని రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

