బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా : సీఎం కేసీఆర్
CM KCR | బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. కచ్చితంగా లక్ష కి.మీ. ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్య శుద్ధి, సంకల్ప
హైదరాబాద్ : బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. కచ్చితంగా లక్ష కి.మీ. ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ప్రపంచంలో మానవజీవితంలో అనేక పర్యాయాలు ఆ విషయాలు రుజువయ్యాయి అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
మీ అందరికి స్వాగతం చెప్పడంతో పాటు చాలా పెద్ద బాధ్యత పెట్టబోతున్నాను. ఒకప్పుడు స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం. జీవితాలను ఆస్తులను, కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేటటువంటి రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో, అంబేద్కర్ మార్గదర్శనంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకుని కార్యలకాపాలు మొదలుపెట్టాం. చక్కటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
ప్రజల కోరికలు సిద్ధించలేదు..
వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఒక విజన్, డైరెక్షన్ ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని బాటలు వేయబడ్డాయి. సాగుతూ వచ్చాం. ఆ తర్వాత రాజకీయాలు, ప్రజాజీవితంలో అనేక మార్పులు సంభవించాయి. గత 50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు అవగాహన కలిగినటువంటి భారతదేశం ఏ దశకు చేరుకోవాల్నో చేరుకోలేదు. ప్రజల కోరికలు, స్వాతంత్ర్య ఫలాలు సిద్ధించలేదు. మన కంటే అమెరికా, చైనా ముందున్నవి. అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నాయి. 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి చైనాలో ఉంది. కానీ మన దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో రమారమి 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందని కేసీఆర్ తెలిపారు.
ఇండియా బెస్ట్ ఫుడ్ చైన్ కలిగి ఉండే కంట్రీగా ఉండాలి
వ్యవసాయం బాగా, అద్భుతంగా జరగాలంటే.. సూర్యకాంతి ఉండాలి. అప్పుడే పంటలు పండుతాయి. సూర్యకాంతి కూడా అపారంగా ఉంది. మన వద్ద మూడు రకాల పర్యావరణ మండలాలు ఉంటాయి. సముద్ర తీరప్రాంతాల్లో ఉండే వాతావరణం పలు రాష్ట్రాల్లో ఉంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు, అతిశీతలంగా ఉండే హిమాలయాలు కూడా ఉన్నాయి. ఆగ్రో క్లైమాటిక్ కండిషన్లో యాపిల్, మామిడి పండుతాయి. మన దేశంలో ప్రతి ఏడాది ఒక లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోంది. ఇది కేంద్రం చెబుతున్న లెక్క. 70 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉంది. భూమి, సోలార్, పర్యావరణ మండలాలు ఉన్నాయి. పని చేసేటటువంటి మనషులు ఉన్నారు. తగిన పద్ధతిలో ముందుకు వెళ్తే.. ప్రపంచంలోనే ఇండియా బెస్ట్ ఫుడ్ చైన్కలిగి ఉండే కంట్రీగా ఉండాలి. మన రైతు లోకమంతా బ్రహ్మాండంగా ఉండాలి. కానీ 13 నెలల పాటు రైతులు ధర్నాలు చేసి, ప్రాణాలు కోల్పోయారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందుకు ఈ దేశం వంచించబడుతున్నది..
లక్షల కోట్ల రూపాయాల విలువైన పామాయిల్, కందిపప్పును దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు ఈ దేశం వంచించబడుతున్నది. ఈ దుస్థితి కొనసాగాల్నా. లేదు నివారించబడాల్నా.. ప్రజాజీవితంలో ఉండే ప్రతి వ్యక్తి ఆలోచించాలి. బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చెక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమే కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. కచ్చితంగా లక్ష కి.మీ. ప్రయణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. సాధించలేనిదంటూ ఏది ఉండదు. ప్రపంచంలో మానవజీవితంలో అనేక పర్యాయాలు ఆ విషయాలు రుజువయ్యాయి అని కేసీఆర్ గుర్తు చేశారు.
మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్
మన దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్లు. కానీ దేశం ఏనాడూ కూడా రెండు లక్షల 10 వేల మెగావాట్లకు మించి వాడలేదు. నీళ్లుంటాయి కానీ పొలాలకు రావు. కరెంట్ ఉంటది కానీ ప్రజలకు రాదు. వనరులు, వసతులు ఉండి ఈ దేశం ప్రజలు శిక్షించబడాలి. వంచించబడాలి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగాల్నా? ఇందులో ఏదైనా మార్పు రావాల్నా? అది ప్రశ్న? మార్పుకోసమే ప్రబలమైన, గుణాత్మకమైనటువంటి మార్పు కచ్చితంగా తీసుకొచ్చి, ప్రజల ఆలోచనా సరళి మార్చి యావత్ దేశంలో ఉండేటటువంటి ఆలోచనాపరులను ఏకం చేసి, ఒక మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

