బీఆర్ఎస్ నేతలపైనే ఉల్టా కేసులు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌కు సినీ ఫక్కీలో ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే బాధిత నాయకులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు ఈ కేసు నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి.
- ఓఆర్ఆర్ దాడి ఘటనలో ముందుగా బీఆర్ఎస్ ఫిర్యాదు
- అయినా, కాంగ్రెస్ ఫిర్యాదుపైనే పోలీసుల తొలి కేసు
ఘట్కేసర్, మే 22: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌కు సినీ ఫక్కీలో ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే బాధిత నాయకులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు ఈ కేసు నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 19న పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, మరికొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. ఓఆర్ఆర్పై కార్లను ఛేజ్ చేస్తూ నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనపై ముందుగా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు కేసు నమోదు చేయలేదు. కాగా, పెద్దఅంబర్‌పేట్‌లో ఒక ఫంక్షన్‌కు హాజరై ఓఆర్ఆర్పై అంబర్పేట్ నుంచి పీర్జాదిగూడకు డిప్యూటీ మేయర్ శివకుమార్, శ్రీధర్‌రెడ్డి, చంద్రారెడ్డి మరో 10 మందితో కలిసి తిరిగి వెళ్తుండగా తమను బీఆర్ఎస్ నాయకులు అడ్డగించి, తమపై దాడికి ప్రయత్నించారని కార్పొరేటర్ అమర్‌సింగ్ ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే మేయర్ వెంకట్‌రెడ్డితోపాటు హరిశంకర్‌రెడ్డి, అనంతరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులపై వెంటనే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఓఆర్ఆర్పై పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల్లను కిడ్నాప్ ఘటనపై బీఆర్ఎస్ నేత రఘువర్ధన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ నాయకులైన అమర్‌సింగ్, శ్రీధర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, చంద్రారెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పరస్పర ఫిర్యాదులు రావడంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

