KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైల్ రోకో కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విచారణపై హైకోర్టు స్టే విధించింది.
KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైల్ రోకో కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విచారణపై హైకోర్టు స్టే విధించింది. విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేసి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. 2011లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునివ్వడంతో కేసు నమోదైంది. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్ 15, 16, 17న రైల్‌రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చామన్న అభియోగంతో ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు నమోదైందని, ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను నిందితుల జాబితాలో చేర్చారని పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి తాను రైల్‌రోకో కార్యక్రమానికి పిలుపు ఇవ్వలేదని, కొందరు మౌఖికంగా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని తెలిపారు. అప్పట్లో మౌలాలిలో రైల్‌రోకో కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ షరతులతో కోర్టు విడిచిపెట్టిందని, ఈ కేసు నమోదైన మూడేండ్లకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కేసీఆర్ గుర్తుచేస్తూ.. తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

