Nominations | నామినేషన్లా.. జైత్రయాత్రలా
తొవ్వంతా బీఆర్ఎస్ జెండాలతో నిజామాబాద్ జిల్లా బోధన్ గులాబీ వనంలా మారింది. గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించింది. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.
బోధన్.. ధనాధన్
తొవ్వంతా బీఆర్ఎస్ జెండాలతో నిజామాబాద్ జిల్లా బోధన్ గులాబీ వనంలా మారింది. గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించింది. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.
ఆర్మూర్.. అదిరే జోరు
జయహో బీఆర్ఎస్ నినాదాలతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మార్మోగింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా కొనసాగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు హాజరైన ఈ కార్యక్రమానికి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
కదిలిన గులాబీ దండు
గులాబీ దండు కదిలింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గురువారం నామినేషన్ వేయగా.. అభిమానులు, పార్టీ శ్రేణులు పోటెత్తారు. బీఆర్ఎస్ జెండాలతో రహదారి మొత్తం గులాబీ వర్ణంలోకి మారింది.
సూర్యాపేట గులాబీ తోట
ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చిన జనంతో సూర్యాపేట జిల్లాకేంద్రం గులాబీ తోటలా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా కొనసాగింది. ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోటెత్తడంతో రోడ్లన్నీ కిక్కిరిసి కనిపించాయి.
పాలమూరు జనహోరు
బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం నామినేషన్ వేయగా, కార్యక్రమానికి ఊరూవాడా కదిలివచ్చింది. బీఆర్ఎస్ శ్రేణుల జయజయ ధ్వానాలతో పాలమూరు హోరెత్తింది
భోనగిరి.. ప్రగతి దారి
భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో భువనగిరి గులాబీమయం అయ్యింది. భారీగా తరలివచ్చిన అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
మునుగోడు..కారుదౌడు
మునుగోడులో ‘కారు’ దౌడు తీస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అభిమానగణం పోటెత్తింది.
కారు.. టాప్‌గేరు
సనత్‌నగర్‌లో కారు టాప్‌గేరులో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు పోటెత్తారు.
చిందేసిన ధర్మపురి

జగిత్యాల జిల్లా ధర్మపురి గురువారం చిందేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేయగా, ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులు తరలివచ్చారు.
జన తాండవం

వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అభిమా నులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన శ్రేణులతో తాండూరు మురిసింది.
జగిత్యాల జైత్రయాత్ర

జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ నామినేషన్ కార్యక్రమం జైత్రయాత్రను తలిపించింది. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి సంజయ్‌కుమార్ నామినేషన్ దాఖలుచేశారు.
చేవెళ్ల.. గులాబీ ఖిల్లా
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గులాబీ ఖిల్లాను తలపించింది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య గురువారం నామినేషన్ దాఖలు చేయగా, టీఆర్ఎస్ అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు.
వనపర్తి.. జనహారతి
వనపర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వనపర్తి పట్టణం జనహారతి పట్టింది. గురువారం నిరంజన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
జన జాతర
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ గురువారం జన జాతరను తలపించింది. టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో కలిసి వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి నామినేషన్ దాఖలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి










