1న గన్‌పార్క్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించింది. మూడు రోజులపాటు తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను వైభవంగా జరుపనున్నట్టు వెల్లడించింది.
- హాజరుకానున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
- 2న తెలంగాణభవన్‌లో జెండా ఆవిష్కరణ
- 3న జిల్లా కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు
- మూడ్రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు
- ప్రకటించిన వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించింది. మూడు రోజులపాటు తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను వైభవంగా జరుపనున్నట్టు వెల్లడించింది. బీఆర్ఎస్ కార్యక్రమాల వివరాలను పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంగళవారం ప్రకటించారు. తెలంగాణ అంటే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.
దశాబ్దాల స్వరాష్ట్రం కలను సాకారం చేసిన పార్టీగా, ప్రాణాలను సైతం లెకచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి, అనేక పోరాటాలు త్యాగాలతో తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను ఎకడికకడ ఘనంగా నిర్వహించాలని సూచించారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ ఆహ్వానించారు.
మూడు రోజుల కార్యక్రమాలు
- జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు గన్పార్లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు తెలంగాణ అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. ఆయనతోపాటు పెద్దఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కూడా పాల్గొననున్నారు.
- జూన్ 2వ తేదీ ఆదివారం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆవిర్భావ దినోత్సవ సంబరాలను పార్టీ నిర్వహించనున్నది. ఉదయం 9:30కి జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎగురవేస్తారు. ఆ తర్వాత పార్టీ శ్రేణుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
- జూన్ 3వ తేదీ సోమవారం జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు, పార్టీ జెండా ఆవిషరణ, అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పార్టీ ప్రకటించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడాలని, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

