అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల కనుసన్నలోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నదని ఆరోపించారు.
- ఎమ్మెల్సీ తాతా మధు.. బీఆర్ఎస్, వామపక్ష నేతల నినాదాలతో దద్ధరిల్లిన ‘ధర్నాచౌక్’
ఖమ్మం, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల కనుసన్నలోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నదని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో 3.50 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం మాత్రం ఆశించినస్థాయిలో మంజూరు చేయలేదని విమర్శించారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ కండువాలు కప్పుకొంటేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా?’ అని ప్రశ్నించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి మాట్లాడుతూ.. గ్రామసభల నిర్ణయాలను గౌరవించాలని, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యనేతలంతా కలిసి కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

