బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
‘సర్' ముసుగులో ఓట్లు తొలగించి బీజేపీకి మేలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ‘దేశంలో ఏం జరుగుతున్నదో ప్రజలందరూ చూస్తున్నారు. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఒక పార్టీకి ఊడిగం చేస్తున్నది’ అని వ్యాఖ్యానించారు.
- బీజేపీకి ఊడిగం చేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ
- ‘సర్’ పేరుతో ఏం జరుగుతున్నదో దేశం చూస్తున్నది
- ‘సర్’ లోపాలను సవరించకుంటే బీఆర్ఎస్ ఉద్యమం
- సీఈసీని వెంటనే తొలగించి అరెస్టు చేయాలి: వద్దిరాజు
- ఓటుహక్కు తీసి బతికున్నవారినీ చంపిండ్రు: గంగుల
- బీఆర్ఎస్ సెగ్మెంట్లలో భారీ కోతపై అనుమానాలు: పల్లా
- రాష్ట్రంలో 95 లక్షల ఓట్లను తిరిగి చేర్చాలి: ఎర్రబెల్లి
- జనాభా పెరుగుతుంటే ఓట్లు తగ్గుతయా?: లక్ష్మారెడ్డి
రాష్ట్రంలో సాగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ‘సర్’ ముసుగులో 95 లక్షల ఓట్లు తొలగించారని వార్తలు వస్తున్నాయి. తొలగించిన ఓటర్లు ఆధారాలు చూపించినా తిరిగి జాబితాలో చేర్చకపోవడంలోని ఆంతర్యమేంది? దీనికి ఎన్నికల సంఘం సమాధానమివ్వాలి.
-ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘సర్’ ముసుగులో ఓట్లు తొలగించి బీజేపీకి మేలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ‘దేశంలో ఏం జరుగుతున్నదో ప్రజలందరూ చూస్తున్నారు. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఒక పార్టీకి ఊడిగం చేస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. ఇదీ ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిదికాదని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి వద్దిరాజు విలేకరులతో మాట్లాడారు. 14సార్లు సీఈసీ నిర్ణయాలతో ఎన్నికల కమిషనర్లు విబేధించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. సీఈసీని అడ్డం పెట్టుకొని బీజేపీ దొడ్డిదారిన గద్దెనెక్కుతున్నదని ధ్వజమెత్తారు.
పశ్చిమబంగా, బీహార్‌లోనూ ఇదే పద్ధతిలో అధికార పీఠాలను దక్కించుకున్నదని విమర్శించారు. రాష్ట్రంలో సాగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ‘సర్’ ముసుగులో 95 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. తొలగించిన ఓటర్లు తర్వాత ఆధారాలు చూపించినా తిరిగి జాబితాలో చేర్చకపోవడంలోని అంతర్యమేంటి? అని నిలదీశారు. రోగికి డాక్టరే విషమిచ్చి చంపిన చందంగా ఓటుహక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘం పౌరులకు ఓటును దూరం చేస్తున్నదని మండిపడ్డారు. దేశజనాభా రోజురోజుకూ పెరుగుతుంటే ఓట్ల సంఖ్య ఎందుకు తగ్గుతున్నదని, దీనిపై సీఈసీ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘సర్’లో లోపాలను సవరించకుంటే బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. ‘సర్’ పేరిట జరిగిన అక్రమాలపై, ఫామ్-7 పేరిట జరిగిన అవకతవకలపై స్వతంత్ర విచారణ చేపట్టాలని స్పష్టంచేశారు.
బీజేపీకి తొత్తులా జ్ఞానేశ్‌కుమార్ : గంగుల
స్వతంత్రంగా వ్యవహరించి పౌరుల ఓటుహక్కును కాపాడాల్సిన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. కరీంనగర్లో 1.06 లక్షల ఓట్లు తొలగించారని, తనకు కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు. ఓటు హకు తీసేసి బతికున్న మనుషులను చంపేశారని మండిపడ్డారు. బీజేపీకి తొత్తుగా ఉన్న జ్ఞానేశ్వర్‌కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఓట్ల తొలగింపుతో బీజేపీకి లాభం : ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఓట్లు తొలగించడంతో లాభపడ్డది బీజేపీ మాత్రమేనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఈసీ కుమ్మక్కయి పలు రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించారని ధ్వజమెత్తారు. ‘పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలను అడ్డుపెట్టుకుని బీజేపీ గెలిచింది. అక్కడ ఎన్నికలు జరిగిన వెంటనే నాలుగు వేల ఈవీఎంలను కాల్చివేయడంతో ఎన్నికల కమిషన్ కుట్ర బయట పడ్డది’ అని అన్నారు. బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఓట్లను అత్యధికంగా తొలగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. బీజేపీ కుతంత్రాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సహకరిస్తున్నదని విమర్శించారు. జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం బూర్గుల రామకృష్ణారావు భవన్ దగ్గర శనివారం బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాను పండుగల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
95 లక్షల ఓట్లను తిరిగి చేర్చాలి : ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణలో తొలగించిన 95 లక్షల ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సీఈసీని డిమాండ్ చేశారు. కొత్త ఓట్లు చేర్చాలని, మరణించినవారివి తొలగించాలని స్పష్టంచేశారు. కానీ అర్హుల ఓట్లను తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

