సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని దళితులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులును దళితుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. విడుతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధును అందజేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలను రెట్టింపు చేశామన్నారు. 50 మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలని నెలకొల్పామని గుర్తు చేశారు. అంతటితోనే ఆగకుండా పీజీ, లా కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ. 20 లక్షల గ్రాంటు ఇస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
తరతరాల భవిష్యత్తుకై రాజ్యాంగం ద్వారా బలమైన పునాది వేసిన అంబేద్కర్ స్పూర్తితో సీఎం శ్రీ కేసీఆర్ గారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రగతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ‘దళిత బాంధవుడి’గా నిలిచారు.
2/2— Harish Rao Thanneeru (@trsharish) April 14, 2022