శనివారం 11 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:58:44

సైకిల్‌ నేర్చుకుంటూ..బావిలోకి జారిపడి బాలుడి మృతి

సైకిల్‌ నేర్చుకుంటూ..బావిలోకి జారిపడి బాలుడి మృతి

రామడుగు: పూడ్చని వ్యవసాయబావి ఓ పసివాని ప్రాణం తీసింది. సైకిల్‌ తొక్కడం నేర్చుకునేందుకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు వ్యయసాయబావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపూర్‌కు చెందిన పంతగాని మల్లేశం, సుమ దంపతుల పెద్దకొడుకు రేవంత్‌(9) ఆదివారం మధ్యాహ్నం సైకిల్‌ నేర్చుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఊరంతా వెతికినా ఆచూకీ దొరుకలేదు. చివరకు వారి ఇంటి సమీపంలోని బావిలో సైకిల్‌ కనిపించింది. మోటర్లతో బావిలోని నీటిని తోడగా అర్ధరాత్రి సమయంలో రేవంత్‌ మృతదేహం లభించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు బావి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
logo