ఆ సోదరులిద్దరూ దొంగలే
‘త్వరలో జరగనున్న ఉప ఎన్నిక కాంట్రాక్టర్లు, దొంగలు, దగాకోరులకు - మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతున్న పోటీ’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ఈ నెల 20న సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ప్రజాదీవెన సభా స్థలాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి కాంట్రాక్టులు తీసుకోలేదన్నారు
- కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి
- నల్లడబ్బు దాచుకొనే దొంగలకు కాషాయ పార్టీ మద్దతు
- విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
మునుగోడు, ఆగస్టు 13 : ‘త్వరలో జరగనున్న ఉప ఎన్నిక కాంట్రాక్టర్లు, దొంగలు, దగాకోరులకు – మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతున్న పోటీ’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ఈ నెల 20న సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ప్రజాదీవెన సభా స్థలాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి కాంట్రాక్టులు తీసుకోలేదన్నారు. నాడు వారు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించిన రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు రూ.21 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరుతున్నాడని విమర్శించారు. నడి బజారులో అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను విమర్శించే అర్హత లేదని తెలిపారు. టీఆర్ఎస్లో చేరేందుకు రాజగోపాల్‌రెడ్డి 300 సార్లు కేసీఆర్ కాళ్లు పట్టుకొన్నారని, పార్టీలోకి రమ్మని టీఆర్ఎస్ ఏనాడూ ఆహ్వానించలేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేనందునే రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులు ఇచ్చే బీజేపీలో చేరుతున్నాడని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి సోదరులు తెలంగాణ వ్యతిరేకి అయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పల్లకీ మోసి.. వేల కోట్లు సంపాదించుకొన్నారని ఆరోపించారు. వారిద్దరూ తోడు దొంగలేనని, ప్రజలను దోచుకొనేందుకు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వచ్చే ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని, బీజేపీ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్తు, రైతుబంధు వద్దంటున్న బీజేపీలో ఎందుకు చేరుతున్నారో రాజగోపాల్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజల రక్తం పీల్చేదని.. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచారని అందులో చేరుతున్నారా? అని రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు.
ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. 20న జరగనున్న ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ అన్ని విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తారని చెప్పారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన దుబ్బకాల్వ సర్పంచ్ సాధు మణెమ్మ తదితరలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

