బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు.. కాంచీపురంలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
గండిపేట మండలంలోని 18వ సర్వే నంబర్లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు.
- గండిపేట భూమి కబ్జా కుట్ర కేసులో కీలక పురోగతి సాధించిన పోలీసులు
మణికొండ, జూన్ 5: గండిపేట మండలంలోని 18వ సర్వే నంబర్లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. నార్సింగి పోలీసులతోపాటు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు, నకిలీ పత్రాలు సృష్టించారన్న గండిపేట తహసీల్దార్ ఎన్ శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
ఆ ఆరోపణలు నిజమేనని దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఇప్పటికే కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టును కోరాడు. కానీ, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో పరారీలో ఉన్న బ్రహ్మనాయుడును పోలీసులు కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

