పారాక్వాట్ నిషేధం హర్షణీయం
ప్రమాదకరమైన గడ్డి మందు పారాక్వాట్ లాంటి విషపూరిత రసాయనాలపై నిషేధం విధించడం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక మైలురాయి అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరొన్నారు.
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ప్రమాదకరమైన గడ్డి మందు పారాక్వాట్ లాంటి విషపూరిత రసాయనాలపై నిషేధం విధించడం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక మైలురాయి అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరొన్నారు. దేశవ్యాప్తంగా పారాక్వాట్ వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని ఆయన స్వాగతించారు.
గతంలోనే తమ పోరాటాన్ని గుర్తించి కేంద్రం కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం పారాక్వాట్ను నిషేధించిందని వినోద్ కుమార్ గుర్తుచేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని రైతాంగానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పారాక్వాట్పై నిషేధం కోసం ఆయన ప్రముఖ వైద్యుడు మహేశ్రెడ్డితోపాటు పలు సామాజిక సంస్థలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)తో కలిసి ఆయన ఏడాది కాలంగా నిరంతర పోరాటం చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించి కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై వినోద్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

