Boinapally Vinod Kumar | ఉద్యమ నినాదాలను కేసీఆర్ సర్కార్ నిజం చేస్తున్నది : బోయినపల్లి వినోద్ కుమార్
Boinapally Vinod Kumar | తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజం అవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 8 : తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజం అవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాక్టుల నిర్మాణం పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శవంతమైన అనేక సంక్షేమ పథకాలు తెలంగాణాలో ప్రవేశ పెడితే ఈ రోజు దేశం మొత్తం తెలంగాణ పథకాలు అనుసరిస్తుందన్నారు. నీళ్లు, నిధులు నినాదాలు ఇప్పటికే నిజమయ్యాయని పేర్కొన్నారు.
ఇప్పటికే వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా, మరిన్ని నియామకాల కోసం నోటిఫికేషన్ లు జారీ చేసిందన్నారు. ఇటీవలే విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో వేలాది మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. తెలంగాణ రాక ముందు ఎట్ల ఉండే.. తెలంగాణ వచ్చినాక ముస్తాబాద్ ఎట్ల అభివృద్ధి చెందిందో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,
రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,
రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావు,జెట్పీటీసీ నర్సయ్య, రైతుబంధు సమితి అధ్యక్షులు గోపాల్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

