మూగజీవాలకూ బ్లడ్ బ్యాంక్
మూగజీవాల ఆరోగ్యరక్షణ కోసం యానిమల్ బ్లడ్ బ్యాంక్, రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరం ఎంతో ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బీ వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం మంత్రుల నివాసంలో వినోద్‌తో ఆల్ ఫర్ యానిమల్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీలక్ష్మీభూపాల్, యానిమల్ బ్లడ్ లైన్ ఫౌండర్ శివ కుమార్‌వర్మ సమావేశమయ్యారు.
- రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరం
- బోయినపల్లి వినోద్‌కుమార్
హైదరాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ): మూగజీవాల ఆరోగ్యరక్షణ కోసం యానిమల్ బ్లడ్ బ్యాంక్, రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరం ఎంతో ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బీ వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం మంత్రుల నివాసంలో వినోద్‌తో ఆల్ ఫర్ యానిమల్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీలక్ష్మీభూపాల్, యానిమల్ బ్లడ్ లైన్ ఫౌండర్ శివ కుమార్‌వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వపరంగా ఎన్జీవోలకు చేయూతపై చర్చించారు.
ఆవులు, బర్రెలు, కుకలు, పిల్లులు తదితర జంతువులు రక్తహీనతకు గురైనప్పుడు, ప్రమాదాల్లో రక్తస్రావమైనప్పుడు రక్తం అందుబాటులో లేక ప్రాణాలు పోతున్నాయని శ్రీలక్ష్మీభూపాల్, శివకుమార్ వివరించారు. రాష్ట్రంలో ఎన్జీవోలకు అమెరికా, యూకే తరహాలో యానిమల్ ఫౌండేషన్లు, బ్లడ్‌బ్యాంక్ మాదిరిగా నిర్వహణ నైపుణ్యాన్ని, అవసరమైన ల్యాబ్ సామాగ్రి, శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, సహకారం కావాలని వినోద్‌ను కోరారు. రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీలో జంతువుల బ్లడ్‌బ్యాంక్, రిసెర్చ్ సెంటర్ నెలకొల్పే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ తెలిపారు. పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, వెటర్నరీ వర్సిటీ వీసీ రవీందర్‌రెడ్డితో మాట్లాడి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

