డబుల్ ఇంజిన్ ఢమాల్!
కేంద్ర ప్రభుత్వంలోని పాలకులు, బీజేపీ నేతలు పదే పదే చెప్తున్న ‘డబుల్ ఇంజిన్' ఢమాల్ మని కుదేలై చతికిలబడింది. దేశంలోని 27 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)లో రియల్ ఎస్టేట్ రంగం నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల (ఎస్డీ-ఆర్సీ) రూపేణా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే
‘రియల్’ ఆదాయ వృద్ధిలో తెలంగాణ నంబర్ వన్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో అత్యధిక వృద్ధిరేటు
2021తో పోలిస్తే 2022లో 136 శాతం వృద్ధి నమోదు
జాతీయ సగటు కంటే మన రాష్ట్రంలో నాలుగు రెట్లు అధికం
తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేని బీజేపీ పాలిత రాష్ర్టాలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వంలోని పాలకులు, బీజేపీ నేతలు పదే పదే చెప్తున్న ‘డబుల్ ఇంజిన్’ ఢమాల్ మని కుదేలై చతికిలబడింది. దేశంలోని 27 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)లో రియల్ ఎస్టేట్ రంగం నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల (ఎస్డీ-ఆర్సీ) రూపేణా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే ఇది అక్షర సత్యమని స్పష్టమవుతున్నది. ఎస్డీ-ఆర్సీ ఆదాయ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. పలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ వృద్ధిరేటు తెలంగాణకు కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. దీంతో ‘డబుల్ ఇంజిన్’ మాట పచ్చి బూటకమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ
దేశంలోని 27 రాష్ర్టాలతోపాటు జమ్ము-కశ్మీర్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల రూపేణా వస్తున్న ఆదాయంపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.1,27,754 కోట్లుగా ఉన్న దేశ మొత్తం ఎస్డీ-ఆర్సీ ఆదాయం 2022లో కేవలం 34% వృద్ధిరేటుతో రూ.1,71,150 కోట్లకు చేరింది. కానీ, రాష్ర్టాలవారీగా చూస్తే తెలంగాణ 136% భారీ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 2021లో రూ.5,243 కోట్లుగా ఉన్న తెలంగాణ ఎస్డీ-ఆర్సీ ఆదాయం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.12,372 కోట్లకు వృద్ధి చెందింది. అంటే నెలవారీ సగటు ఆదాయం రూ.436 కోట్ల నుంచి రూ.1,031 కోట్లకు పెరిగింది. ఎస్డీ-ఆర్సీ ఆదాయ వృద్ధిరేటు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ తర్వాత జమ్ము-కశ్మీర్ (88%), సిక్కిం (78%) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

తుస్సుమన్న డబుల్ ఇంజిన్
ఎస్డీ-ఆర్సీ ఆదాయ వృద్ధిరేటులో బీజేపీ పాలిత రాష్ర్టాలు తెలంగాణకు కనీసం దరిదాపుల్లో కూడా లేవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తేల్చింది. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లాంటి రాష్ర్టాల్లో వృద్ధిరేటు కనీసం 40% కూడా లేదని వెల్లడించింది. గుజరాత్లో 41%, హర్యానా 47% వృద్ధిరేటుతో సరిపెట్టుకొన్నట్టు తెలిపింది. బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు దేశంలోని ఇతర పెద్ద రాష్ర్టాల ఎస్డీ-ఆర్సీ ఆదాయ వృద్ధిరేటు భౌగోళికంగా చాలా చిన్నవైన ఈశాన్య రాష్ర్టాల కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

