Maheshwar Reddy | దుష్ట చతుష్టయానికి లై డిటెక్టర్ పరీక్షలు చేస్తే నిజాలన్నీ బయటకు వస్తయ్ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Maheshwar Reddy | దుష్ట చతుష్టయానికి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే హిల్ట్ పాలసీలో నిజాలన్నీ బయటకు వస్తయ్ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హిల్ట్ పాలసీపై చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరిన బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పూర్తి ఆధారాలతో శనివారం పలు ఫైల్స్‌తో మీడియా పాయింట్‌కు వచ్చారు.
Maheshwar Reddy | దుష్ట చతుష్టయానికి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే హిల్ట్ పాలసీలో నిజాలన్నీ బయటకు వస్తయ్ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హిల్ట్ పాలసీపై చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరిన బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పూర్తి ఆధారాలతో శనివారం పలు ఫైల్స్‌తో మీడియా పాయింట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చర్చల కోసం ఏర్పాట్లు చేసి మంత్రి కోసం నిరీక్షించారు. ఈ సందర్భంగా కొంత సేపు హైడ్రామా చోటు చేసుకుంది. రూ.6.30లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రాత్రికి రాత్రే ప్రభుత్వం జీవోను తీసుకువచ్చిందని.. చెప్పినట్లుగానే రుజువు చేసేందుకు అసెంబ్లీలో ఫైల్స్‌కు తీసుకువచ్చానన్నారు. అయితే, చైర్లకు వేసిన మంత్రుల ప్లేర్లను అసెంబ్లీ సిబ్బంది తొలగించారు.
దాంతో ఉత్తమ్, భట్టి ఎప్పుడు వస్తారో కనుక్కొని చెప్పాలని సిబ్బందికి చెప్పగా.. తమకు సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు అవగాహన లేదని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తే చర్చకు రాలేదని విమర్శించారు. భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా ఎవరూ రాలేదన్నారు. సబ్ కమిటీ వేస్తే మినిట్స్, దాని విషయాలు బయటప ఎట్టారా? అంటూ ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం (భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి) లై డిటెక్టర్ టెస్టులు చేస్తే అవే నిజాలు బయటకు వస్తాయన్నారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే ఎవరూ రాలేదన్నారు. గతంలో ఇండస్ట్రియల్ కోసం కేటాయించిన భూములను మాయం చేస్తున్నారని.. గతంలో ఎవరికి అలకేట్ చేశారో వాళ్లకే దారాదత్తం చెయ్యడం వెనక ఉద్దేశం ఏంటో ప్రభుత్వం చెప్పాలన్నారు.
స్వార్థం కోసం లక్షల కోట్ల ప్రభుత్వ ధనం కొల్లగొడుతున్నారని.. కేంద్ర అధిష్టానానికి కమిషన్ ఇవ్వడం కోసమే ఈ స్కామ్‌కు తెరలేపారని.. దీనిపై బీజేపీ పోరాడుతుందన్నారు. నిజంగా ప్రభుత్వం ప్రజల మేలు కోరేదైతే రూ.6,30,000 కోట్ల ఆస్తిని కేవలం రూ.5వేల కోట్లకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే దొంగలా ఎందుకు జీవోను తీసుకువచ్చారని నిలదీశారు. సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటే సిఫారసు ప్రకారం ఎందుకు ముందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రజలు ఆవాసాలు ఏర్పరచుకుంటే.. అక్కడ ఉన్న కెమికల్ వ్యర్థాల కారణంగా ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఒక రియల్టర్‌గా, మంత్రులు మోసగాళ్లలా వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో చర్చకు తావివ్వకుండా ప్రజల ఆస్తి కొల్లగొట్టడం అప్రజాస్వామికమన్నారు. హిల్ట్‌పై ఛాలెంజ్ చేస్తే ఎందుకు చర్చకు ఒక్క వ్యక్తి రాలేదని.. అంటే తప్పు ఒప్పుకున్నట్లేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపై ప్రశ్నించాలని రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

