Nallgonda | నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మార్చాల్సిందే.. హైకమాండ్‌కు ఫిర్యాదుల వెల్లువ!
Nallgonda | నల్లగొండ ఎంపీ టికెట్ శానంపూడి సైదిరెడ్డికి కేటాయించడంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
నల్లగొండ : నల్లగొండ(Nallgonda) జిల్లా బీజేపీ(BJP) పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది. నల్లగొండ ఎంపీ టికెట్ శానంపూడి సైదిరెడ్డికి(Saidireddy) కేటాయించడంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసం తృప్తితో రగిలిపోతున్నారు. ఏది ఏమైనా సైదిరెడ్డిని మార్చాలని జిల్లా నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు జిల్లా బీజేపీ నేతలు పార్టీ పెద్దలను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
సైదిరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులపై దాడు చేయించి కేసులు పెట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యక్తి టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. సైదిరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని ముక్తకంఠంతో నినదించినట్లు సమాచారం. అయితే ఇదే సందర్భంలో తెరపైకి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేరు రావడం మరింత గందరగోళానికి తెరలేపినట్లయింది.
ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తేరా చిన్నపరెడ్డి, ఎంపీ టికెట్ ఇస్తామంటే బీజేపీలో చేరేందుకు సిద్దమని సంకేతాలు పంపినట్లు తెలిసింది. బీజేపీ అధిష్ఠానం ఎంపీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి పేరును పరిశీలిస్తున్నారని జిల్లా బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో సైదిరెడ్డి వర్గీయుల్లో ఆందోళన నెలకొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Errabelli Dayakar Rao | ఈ పరిపాలన ఇక రాదు.. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి : ఎర్రబెల్లి దయాకర్ రావు
Sitarama Project | సీతారామ కాలువ పనులను అడ్డుకున్న కమలాపురం రైతులు
Anupama Parameswaran | మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించడానికైనా రెడీ.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!
Washington hair | అమెరికా తొలి అధ్యక్షుడి జట్టు వేలం.. మూడు వెంట్రుకల ధర 3.7 లక్షలు..!
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న రావడం లేదని మేకర్స్ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

