బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నది : తమ్మినేని వీరభద్రం
Tammineni Veerabharam | బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరిస్తున్నదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
సిద్దిపేట : బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరిస్తున్నదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో అమరవీరుల సంక్షేమ సభకు హాజరై ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీకి దేశద్రోహ చరిత్ర తప్ప దేశభక్తి లేదని మండిపడ్డారు. స్వాతంత్ర పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం అన్నారు.
గాంధీజీని చంపిన చరిత్ర బీజేపీ నాయకులకు ఉందని ఘాటుగా విమర్శించారు. కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తూ ఆ పార్టీ దేశాన్ని అంధకారంలోకి నెడుతుందన్నారు. సంపన్న వర్గాల మేలు కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశ విభజన జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీని ఢీకొట్టే దమ్ము టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికే మద్దతు ప్రకటించామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

