బీజేపీ అంటే బీసీల ఝూటా పార్టీ
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బీసీల ఝూటా పార్టీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు.
- కులగణనలో బీసీ కులాలు నమోదు చేయాలి : జాజుల
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బీసీల ఝూటా పార్టీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. జాతీయ కులగణన సర్వే మొదటి విడతలో బీసీ కులాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ వద్ద గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీలకు సంబంధించి 10 అంశాలపై సమాధానమివ్వాలని కోరినా, ప్రధాని మోదీ స్పందించలేదని తెలిపారు. బీసీ కులగణన చేయకుండా రాష్ట్రంలో బీజేపీ ఇంకో వందేళ్లు అ యినా అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. బీసీల కులగణన విషయంలో బీసీలను ప్రధాని మరోసారి మోసం చేశారని మండిపడ్డారు. త్వరలో పరేడ్ గ్రౌండ్లో బీసీ మహాగర్జన నిర్వహించి బీసీల సత్తాను చూపిస్తామని పేర్కొన్నారు. 12ఏండ్ల పాలనలో బీసీలకు బీజేపీ ఒరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించకుండా అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

