ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు
- 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో
- లోగోను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): జీవశాస్ర్తాలు, ఔషధ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా సదస్సు 20వ ఎడిషన్ తేదీలు ఖరారయ్యాయి. ఈ సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం సదస్సు థీమ్‌తోపాటు లోగోను ఆవిష్కరించారు. అడ్వాన్సింగ్ ఫర్ వన్-షేపింగ్ ది నెక్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్ అనే థీమ్‌తో నిర్వహించనున్న ఈ సదస్సు ద్వారా రానున్న తరాలకు సరసమైన ధరల్లో మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నారు. గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రపంచంలోనే ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించింది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల తయారీలో కీలకపాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకొన్నది. మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థలు కుదుట పడుతున్న ప్రస్తుత సందర్భంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల ప్రముఖులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రతినిధులు మరోసారి ఒకే వైదికపైకి వచ్చి చర్చించనున్నారు. మానవీకరించిన ఆరోగ్య సంరక్షణ రేపటి తరాన్ని రూపొందించడం, అందుకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడంపై సదస్సు దృష్టి సారిస్తుంది. డాటా, అనలిటిక్స్, కృత్రిమమేధ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తదితర సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో సదస్సును నిర్వహిస్తున్నారు. నూతన ఆవిష్కరణలను, స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా ఈ వేదిక ఆరోగ్య సంరక్షణ రంగంలోని అధిపతులు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, రెగ్యులేటర్లు, పెట్టుబడిదారులను సదస్సు ప్రోత్సహిస్తుంది. 100 మందికిపైగా ఆరోగ్య, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.
ఘనంగా సదస్సు నిర్వహణ: కేటీఆర్
బయో ఏషియా- 2023 సదస్సు లోగోను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొవిడ్ అనంతరం ప్రపంచం సాధారణ స్థితికి చేరుకొంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ సదస్సును అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. పరిశోధకులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, విధాన నిర్ణేతలు ఆరోగ్య సంరక్షణపై చర్చించి నూతన పరిష్కార మార్గాలను అందిస్తారని పేర్కొన్నారు. బయో ఏషియా 20వ సదస్సును అత్యంత ఘనంగా నిర్వహిస్తామని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. గత ఏడాది కరోనా నేపథ్యంలో బయో ఏషియా-2022 సదస్సును వర్చువల్‌గా నిర్వహించగా.. 70 దేశాలకు చెందిన 37,500 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. పలువురు నోబెల్ బహుమతి విజేతలు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెక్స్ గోర్క్సి, నోవార్టీస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్, మెడ్‌ట్రోనిక్ చైర్మన్ జియోఫ్ మార్తా వంటి ప్రముఖులు పాల్గొనడం విశేషం.
బయో ఏషియా సదస్సు 2023 విశేషాలు
ఆతిథ్య నగరం: హైదరాబాద్
నిర్వహణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
థీమ్: అడ్వాన్సింగ్ ఫర్ వన్-షేపింగ్ ది నెక్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్
లక్ష్యం: నూతన సాంకేతికతల సహకారంతో భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BioAsia
- KTR
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

