బయో వ్యర్థాల నిబంధనలు కఠినంగా అమలు చేయాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, మే 24: జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్ధాల నుంచి ప్రజలు, ఇతర జీవరాసులను రక్షించేందుకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం అరణ్య భవన్లో జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ- నివారణ, బయో మెడికల్ వేస్టేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, నదీ జలాల కాలుష్య నియంత్రకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్ని రకాల కాలుష్య కారకాలు, నియంత్రణకు పీసీబీ తీసుకుంటున్న చర్యలను పీసీబీ సభ్య కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్ మంత్రికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 11 కామన్ బయోమెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాల్లో జీవ వైద్య (బయో మెడికల్) వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నామని వెల్లడించారు.
దేశంలోనే తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బయోవ్యర్థాలను తరలించే వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానం చేసినట్లు వివరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సీఎం ఆశయానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణకు అధికారులు పనిచేయాలన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు.
పరిశ్రమల నుంచి వ్యర్థ జలాల శుద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్ల నిర్వహణ, పనితీరును ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు.
ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తుందని, కాలుష్యకారక పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యావరణాన్ని కాపాడేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూలై 2022 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం అమలు కానుందని నగరాలు, పట్ణణాల్లో కాలుష్యం, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టిపి) లో ఘన, ద్రవరూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలని, కొత్తగా మరికొన్ని ఎస్టిపిలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దానికి అనుగుణంగా డీపీఆర్ తయారు చేయాలన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) మురళీధర్,సీఈ రఘు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

