Bhuvanagiri Fort | భువనగిరి కోటకు పర్యాటక హంగులు.. రోప్‌వే, పార్కింగ్, హోటల్
Bhuvanagiri Fort | భువనగిరి కోట అభివృద్ధి పనులను అక్టోబర్ 2 లోగా పూర్తిచేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కోట వద్ద పర్యటించిన ఆయన కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. రోప్‌వే, హోటల్, పార్కింగ్, మరుగుదొడ్లు, చిన్నారుల ఆటస్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫ్, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ సహా పర్యాటక సదుపాయాలను పరిశీలించారు.
Bhuvanagiri Fort : భువనగిరి కోట అభివృద్ధి పనులను అక్టోబర్ 2 లోగా పూర్తిచేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కోట వద్ద పర్యటించిన ఆయన కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. రోప్‌వే, హోటల్, పార్కింగ్, మరుగుదొడ్లు, చిన్నారుల ఆటస్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫ్, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ సహా పర్యాటక సదుపాయాలను పరిశీలించారు. అవసరమైతే రాత్రింబవళ్లు పనులు చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని జూపల్లి తెలిపారు. చారిత్రక వైభవాన్ని కాపాడుతూ భువనగిరి కోటను ఆధునిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. యాదాద్రి, భువనగిరి కోట, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక -వారసత్వ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.56.81 కోట్లతో ‘భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియెన్షియల్ జోన్’ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
ఇందులో రూ.17.91 కోట్లతో 1,020 మీటర్ల పొడవైన రోప్‌వే నిర్మిస్తున్నారు. గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులు వినియోగించుకునే సామర్థ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన నిధులతో రహదారులు, పార్కింగ్, వీక్షణ గ్యాలరీ, కేఫ్, విద్యుదీకరణ, తాగునీటి సదుపాయాలు, సీసీ కెమెరాలు, భద్రతా వ్యవస్థలు, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ వంటి పనులు చేపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

