సభలో ‘చిట్టీ’ నవ్వుల్
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చర్చ సందర్భంగా చిట్టీలు (స్లిప్పులు) అనే అంశం నవ్వులు పూయించింది. ఐటీఐఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చర్చ సందర్భంగా చిట్టీలు (స్లిప్పులు) అనే అంశం నవ్వులు పూయించింది. ఐటీఐఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సాధ్యమైనంత వరకూ దానికోసమూ పోరాటం చేద్దాం అన్నారు.
దీనిపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరగా మాజీ మంత్రి కేటీఆర్ కలుగజేసుకొని ‘భట్టి అన్నా.. ఓ సూచన..’ అనగానే, భట్టి మాట్లాడుతూ.. ‘మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు. ఏదైనా సూచన చేయాలనుకుంటే చిట్టీ రాసి ఇవ్వండి’ అంటూ నవ్వారు. సభలోకి మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తుండటాన్ని గమనించిన భట్టి ‘హరీశ్‌గారు ఇస్తున్నారు.
మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తున్నారు’ అనగానే.. అంతా బిగ్గరగా నవ్వారు. ‘మావోళ్లకు పంపిస్తే.. మీరేందే భట్టన్నా నన్ను బద్నాం చేస్తున్నారు’ అంటూ హరీశ్‌రావు నవ్వుకుంటూ సమాధానం ఇచ్చారు. భట్టి పక్కనే ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ‘బీఆర్ఎస్ హరీశ్రావుగారు.. బీజేపీ హరీశ్‌రావు ద్వారా చిట్టీలు అందించారు’ అనగానే అంతా ఒక్కసారిగా నవ్వారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

