హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్‌గా డాక్టర్ భారతి కులకర్ణి నియమితులయ్యారు. ఈమేరకు ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఎన్ఐఎన్లో శాస్త్రవేత్తగా 20 ఏళ్లుగా సేవ చేస్తున్నారు. భారతి చేసిన పరిశోధనలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పబ్లిష్ అయ్యాయి. భారతి పూణే యూనివర్సిటీ నుంచి పీడియాట్రిక్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్, ఆస్ట్రేలియా క్వీన్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టోరల్ డిగ్రీ సాధించారు.