ట్విట్టర్ ట్రెండింగ్‌లో…
టీఆర్ఎస్ స్థానంలో జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బుధవారం ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ స్థానంలో జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బుధవారం ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. #(యాష్‌ట్యాగ్) కేసీఆర్ ఫర్ ఇండియా పేరుతో టాప్‌లోకి చేరినది. అదేవిధంగా #కేసీఆర్ గోస్ ఫర్ నేషనల్, #బీఆర్ఎస్పార్టీ,# దేశ్‌కి నేత కేసీఆర్, # తెలంగాణ పేర్లు ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలిచాయి. విజయ దశమి అంటే విజయానికి ప్రతీక.. అదేరోజు జాతీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్‌కు మంచి భవిష్యత్తు ఉంటున్నదని పలువురు ట్వీట్ చేశారు. కేసీఆర్ గతంలో చేసి చూపించారు. ఇప్పుడు మళ్లీ చరిత్ర సృష్టించే సాహసం చేస్తున్నారు అని మరికొంతమంది ట్వీట్ చేశారు.
- “నాడు తెలంగాణ కోరుకున్నారు, కేసీఆర్ సాధించి ఇచ్చారు. ఇప్పుడు దేశ ప్రజలు రెండు నియంత పార్టీల నుండి స్వాతంత్య్రం కావాలనుకొంటున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది” అని నవీన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
- “నాడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకొన్నారు కేసీఆర్. నేడు దేశంలో జరుగుతున్న నిలువు దోపిడీని అడ్డుకోవడానికి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్‌కు స్వాగతం, అభినందనలు” అంటూ కల్యాణ్ సందీప్ ట్వీట్ చేశారు.
- “రెండు ప్రధాన జాతీయ పార్టీలు కలిసి దెబ్బతీసిన ఫెడరల్ స్ఫూర్తి తిరిగి రావాలంటే కే చంద్రశేఖర్‌రావు జాతీయ పార్టీ పెట్టాల్సిందే” అంటూ సుప్రియా రెడ్డి ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

