సుల్తాన్‌బజార్, ఆగస్టు 16: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ ‘భారత్ కే అన్మోల్’ పురస్కారం అందుకున్నారు. తాను చేసిన సేవలకుగాను హుస్సేనీకి న్యూఢిల్లీకి చెందిన ది న్యూస్ యులైక్ ఆంగ్ల మ్యాగజైన్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. జూలై 31న న్యూఢిల్లీలో ఈ అవార్డులను అందుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల హుస్సేనీ ఢిల్లీకి వెళ్లలేకపోయారు. ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు ఏకే ఖాన్ చేతుల మీదుగా భారత్ కే అన్మోల్ పురస్కారాన్ని హుస్సేనీ బుధవారం అందుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, ఉద్యోగుల సహాయ సహకారాలతో సమాజంలో పేదలకు సేవచేసే అవకాశం లభించదని ఈ సందర్భంగా హుస్సేనీ తెలిపారు.