సీఎం రేవంత్‌రెడ్డిపై ‘బీఏఎస్పీఏ’ ఫైర్
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు, చేసే పనులకు పొంతనే ఉండదు.. ఇక మా దళిత, గిరిజనులను మీరేం ఉద్ధరిస్తారు’ అంటూ బీఏఎస్పీఏ(బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తొలుత రూ.150 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి అమర్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి సతావత్ రమేశ్‌నాయక్ తీవ్రంగా ఖండించారు.
- మీరు చెప్పే మాటలు, చేసే పనులకు పొంతనే ఉండదు.. ఇక దళిత, గిరిజనులను ఏం ఉద్ధరిస్తారు? అని ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్23 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు, చేసే పనులకు పొంతనే ఉండదు.. ఇక మా దళిత, గిరిజనులను మీరేం ఉద్ధరిస్తారు’ అంటూ బీఏఎస్పీఏ(బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తొలుత రూ.150 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి అమర్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి సతావత్ రమేశ్‌నాయక్ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దళిత, గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని, నిధులు ఇవ్వకపోవడంతో ఆ పాఠశాలలను మూసివేసే పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. నిజంగా దళిత, గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే బకాయిలను వెంటనే విడుదల చేయాలని అమర్‌కుమార్, రమేశ్‌నాయక్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

