ఆదిమానవుడి అద్భుత చిత్రలేఖనం

- జోగులాంబ జిల్లా మేడికొండలో వెలుగులోకి
- రాతియుగం పెయింట్లను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా మేడికొండ గ్రామ శివారులోని ఫకీరోనిమిట్ట వద్ద ఉన్న కొండ గుహల్లో కొత్తరాతి చిత్రాలు బయటపడ్డాయి. సముద్రమట్టానికి 239 మీటర్ల ఎత్తులో 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పున్న రాతి కాన్వాసుపై ఈ చిత్రాలను ఆదిమానవులు గీశారు. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హనుమయ్యగారి వేమారెడ్డి, టీ పద్మారెడ్డి, ఎస్ హన్మంతరెడ్డి శుక్రవారం గుర్తించారు. ఈ రాతి చిత్రాలలో దుప్పులు, వేటాడుతున్న పెద్దపులి, అడవిపంది, ఇద్దరు మనుషుల బొమ్మలు ఉన్నాయి. ‘దుప్పి రాతి చిత్రాలు తెలంగాణలోని పలుచోట్ల కనిపించినప్పటకీ ఈ చిత్రం ప్రత్యేకం. దుప్పులలో ఒక దుప్పి పెద్దకొమ్ములతో కనిపిస్తున్నది. పెద్దపులి రాతి చిత్రాలు పాండవులగుట్ట, గోపరాజుపల్లి, హస్తలాపూర్, వట్టిమల్లలో కనిపించాయి. మేడికొండలో పెద్దపులి వేటాడుతున్నట్టు చిత్రం ఉన్నది. అలాగే ఇద్దరు మానవుల పుల్లగీతలు, అడవిపంది చిత్రాలు అపూర్వమైనవి’ అని వారు తెలిపారు. తెలంగాణలో రాతి చిత్రాల తావుల సంఖ్య 2013లో 18 మాత్రమే ఉండగా, ప్రస్తుతం 60 దాటాయి. పురావస్తుశాఖ 18, ఇతరులు 16, కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధనల్లో 26 కిపైగా తావులు గుర్తించినట్టు హనమయ్యగారి వేమారెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | డిసెంబర్ 24న బాలయ్య ‘దాదా’ జాతర.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇస్తామంటూ మేకర్స్ హామీ!
Varanasi | యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన ‘వారణాసి’ భారీ కాశీ సెట్.. ఏరియల్ వ్యూ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
Bigg Boss 10 | నామినేషన్లతో హీటెక్కిన హౌస్.. వర్షిణి -సుధీర్ ఫైట్, అమన్‌పై దేబ్జానీ ఫైర్!
Revanth Reddy | పల్నాడుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్సే.. రేవంత్‌రెడ్డి తప్పడు ఆరోపణలు
Agricultural University | అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

