ఆ 10 మందిని గెలిపిద్దాం!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కేటాయించిన 10 మంది మున్నూరుకాపు అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జలవిహార్‌లో ఆదివారం మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లీనరీ సన్నాహక సమావేశం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన జరిగింది.
- మున్నూరుకాపు ప్లీనరీ సన్నాహక సమావేశంలో మంత్రి గంగుల
ఖైరతాబాద్, ఆగస్టు 27: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కేటాయించిన 10 మంది మున్నూరుకాపు అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జలవిహార్‌లో ఆదివారం మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లీనరీ సన్నాహక సమావేశం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మున్నూరుకాపులకు సరైన ప్రాధాన్యం లేదని, ప్రత్యేక రాష్ట్రం లో సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాల కల్పించాలని సీఎంను కలిసి వివరిస్తామని చెప్పారు. ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ త్వరలోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం సీఎంను కలుద్దామని తెలిపారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, దాస్యం వినయ్‌భాస్కర్, వనమా వెంకటేశ్వరరావు, నన్నపనేని నరేందర్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లతిత, పూల రవీందర్, మాజీ మంత్రి నేరళ్ల ఆంజనేయులు, అపెక్స్ కమిటీ చైర్మన్ పుటం పురుషోత్తంరావు పటేల్, అధ్యక్షుడు కొండా దేవయ్య, ప్రధాన కార్యదర్శి వైద్యం వెంకటేశ్వర్లు, కోశాధికారి విష్ణు జగతి, మున్నూరుకాపు మహాసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికొండ వెంకటేశ్వర్రావు, మంగళారపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

