NRI | జీటీఏ డెట్రాయిట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
NRI | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) (GTA Detroit) ఆధ్వర్యంలో డెట్రాయిట్ చాప్టర్లో మంగళవారం బతుకమ్మ పండుగ(Bathukamma celebrations) వేడుకగా జరిగింది. వందలాది మంది మహిళలు తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మలను పేర్చి.. గౌరీ దేవిని స్మరిస్తూ జానపద పాటలు పాడుతూ, ఆటలు ఆడారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) (GTA Detroit) ఆధ్వర్యంలో డెట్రాయిట్ చాప్టర్లో మంగళవారం బతుకమ్మ పండుగ(Bathukamma celebrations) వేడుకగా జరిగింది. వందలాది మంది మహిళలు తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మలను పేర్చి.. గౌరీ దేవిని స్మరిస్తూ జానపద పాటలు పాడుతూ, ఆటలు ఆడారు.
ఈ సందర్భంగా జీటీఏ యూఎస్ఏ ప్రెసిడెంట్ ప్రవీణ్ కేసిరెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచమంతా వ్యాపింపజేయడం సంతోషంగా ఉందన్నారు. నగరంలో మొదటిసారిగా జరిగిన ఈ వేడుకకు అపూర్వమైన స్పందన లభించిందన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు రుచికరమైన ఆహారం, ఫేస్ పెయింటింగ్ వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

బతుకమ్మ ఆడుతున్న ఎన్నారైలు
సుమారుగా 50 మంది వలంటీర్లు బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయడంలో తమవంతుగా కృషి చేశారు. సుమారు 1500 మంది హాజరై, నోవి సివిక్ సెంటర్ భవన సదుపాయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించారు. అదేవిధంగా..కొలరాడోలోని డెన్వర్ చాప్టర్లోనూ బతుకమ్మ వేడుకను వైభవంగా నిర్వహించారు. నిర్వహణ కమిటీ సభ్యులు సుష్మా పదుకొణె, సుమ కలువల, స్వప్న చింతపల్లి, స్వప్న కాల్వల కార్యక్రమాన్ని పర్యవేక్షించింది.

జీటీఏ యూఎస్ఏ ట్రస్టీ బోర్డు సభ్యులు కృష్ణప్రసాద్ జలిగామ, సంతోష్ కాకులవరం, మల్లికార్జున్ పడుకోనే, మహేష్ వెనుకదాసుల, డెట్రాయిట్ నగర బాధ్యులు కమల్ పిన్నపురెడ్డి, వెంకట్ వదనాల, లక్ష్మీనారాయణ కర్నాల, మధుసూధన్ రెడ్డి మాలుగారి, సత్యధీర్ గంగసాని, శ్రీరామ్ జాల, కరుణాకర్ కందుకూరి, యుగంధర్ భూమిరెడ్డి, యాదగిరి ఐలేని, వెంకట్ నటాల, ప్రేమ్ రెడ్డి చింతపల్లి, అరుణ్ బచ్చు, వినోద్ ఆత్మకూర్, డాక్టర్ రాకేష్ లట్టుపల్లి, మహేశ్ బాబు బురుల్లు, వలంటీర్లు సురేందర్ నాగిరెడ్డి, సాయినాథ్ లచ్చిరెడ్డిగారి, సందీప్ నారాయణప్ప, గోవింద్రాజన్ తట్టాయి, రాహుల్ పాల్ రెడ్డి, అభిలాష్ భూమిరెడ్డి, రమాకాంత్ బానూరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

