హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను (Bathukamma celebrations) డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వ హించారు. తెలంగాణా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు సచివాలయంలోని ఉన్నతాధికారుల నుంచి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. బతుకమ్మ, కోలాట పాటలతో అలరించారు. అనంతరం బతుకమ్మలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు.