Bandi Sanjay | ఉల్టా కేసు పెట్టబోయి మరింత ఇరుక్కున్న బండి సంజయ్ కుమారుడు.. కీలక సాక్ష్యాలు ఇచ్చిన సాయి భగీరథ్
Bandi Sanjay | పోక్సో కేసు నుంచి బయటపడేందుకు ఉల్టా కేసు పెట్టబోయి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ మరింత ఇరుక్కుపోయాడు. మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆ కేసులో నుంచి బయటపడేందుకు చేసిన ఎత్తుగడే ఆయనను మరింత ఇందులో ఇరికించిందని న్యాయనిపుణులు అంటున్నారు.
Bandi Sanjay | పోక్సో కేసు నుంచి బయటపడేందుకు ఉల్టా కేసు పెట్టబోయి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ మరింత ఇరుక్కుపోయాడు. మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆ కేసులో నుంచి బయటపడేందుకు చేసిన ఎత్తుగడే ఆయనను మరింత ఇందులో ఇరికించిందని న్యాయనిపుణులు అంటున్నారు.
బండి భగీరథ్ మీద బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారనే కంగారులో బండి సంజయ్ టీమ్ వెంటనే కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఉల్టా కేసు బుక్ చేయించారు. ఇరుక్కుపోయాననే భయం వల్లనో.. లేదా నిజాలను దాచాలనే ప్రయత్నం వల్లనో బండి భగీరథ్ ఆ ఫిర్యాదులో అనేక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆ అమ్మాయితో జరిగిన అనేక అంశాలను పూసగుచ్చినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చారు. అవే ఇప్పుడు బాధితురాలు పెట్టిన పోక్సో కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి.
మైనర్‌తో ఇష్టపూర్వక లైంగిక సంబంధాలు కలిగి ఉన్నా అది పోక్సో చట్టం కింద నేరమే. అలాంటిది బాధితురాలు స్పష్టంగా తనను మత్తులో దించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశాక, చట్టం ప్రకారం దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. బాధితురాలు ఆర్థికంగా బలమైన కుటుంబం నుంచే వచ్చింది. కాబట్టి వాళ్లు బెదిరిస్తే రూ 50,000 ఇచ్చాను అని బండి భగీరథ్ ఫిర్యాదులో పేర్కొనడం ఆయనను ఇంకా ఇరికిస్తుంది. ఏ తప్పూ చేయకపోతే రూ 50,000 ఎందుకు ఇస్తారు ఎవరైనా? అయినా కేంద్ర మంత్రి కొడుకును బెదిరించే సాహసం ఎవరైనా చేస్తారా? అని న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తంచేశారు.
తనపై హనీట్రాప్ చేశారని ఫిర్యాదు చేయడం కూడా బండి భగీరథ్‌ను దోషిగా నిర్ధారిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒకసారి అటువైపు మైనర్ బాలిక ఉన్నాక.. హనీట్రాప్ అన్న పదమే చెల్లుబాటు కాదని చెబుతున్నారు. మొత్తానికి కేసు నుంచి తప్పించుకోవడానికి బండి సంజయ్ పుత్రరత్నం చేసిన ఎత్తుగడ ఆయనకే బెడిసికొట్టిందని పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

