Balkampet Ellamma | అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం
Balkampet Ellamma | బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగుతున్నది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఈ కల్యాణోత్సవం ప్రారంభమైంది.
సనత్నగర్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఈ కల్యాణోత్సవం ప్రారంభమైంది. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ప్రజలు టీవీల్లో వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఏటా ఆషాడ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భక్తులు భారీగా కల్యాణోత్సవానికి విచ్చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. ఇవాళ అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణం చేస్తున్నారు. చివరిగా రేపు సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. అంతటితో అమ్మవారి కల్యాణోత్సవాలు ముగుస్తాయి.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. pic.twitter.com/YlB89HsTgg
— Namasthe Telangana (@ntdailyonline) June 20, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

