బాల్క సుమన్ కేసు బంజారాహిల్స్ పీఎస్‌కు!
సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని చెప్పారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును బంజారాహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు.
బంజారాహిల్స్,జూన్ 3: సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని చెప్పారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును బంజారాహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు. గతనెల 26న బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లిలోని సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సింగరేణి ఆస్తులను కాల్చేయండి.. రైలు పట్టాలను కోసేయండి.. తదితర వ్యాఖ్యలు చేయడంపై బీఎన్ఎస్ 326(జీ),55,61(2), 351(3), 353 (1),(బీ), 152తో పాటు పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. గత శనివారం సుమన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా సుమన్ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ భవన్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుండడంతో ఈ కేసును బుధవారం ఇక్కడికి బదిలీ చేశారు. దీంతో ఇక్కడ తాజాగా మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణను చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

