Balka Suman | నాగార్జున రూ.400 కోట్లు ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత : బాల్క సుమన్
Balka Suman | సినీ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna) రూ.400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్(N Convention) కూలగొట్టారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ : సినీ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna) రూ.400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్(N Convention) కూలగొట్టారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎఫ్టీఎల్ జోన్లో ఉందని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టారు. అయితే హిమాయత్ సాగర్‌లో ఆనంద కన్వెన్షన్ ఉంది. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, సిఫాయి, హైదరా బాద్‌లోని చెరువులను రక్షించే రక్షడు రేవంత్ రెడ్డి(Revanth reddy) ఆనంద కన్వెన్షన్‌ను ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు.
ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఏంటంటే నాగార్జున రూ.400 కోట్లు ఇవ్వనందుకే కూల్చివేస్తున్నారనే చర్చ జరుగుతుందన్నారు. ఆనంద కన్వెన్షన్ వాళ్లు ముడుపులు ముట్ట చెప్పినందుకే కూల్చలేదని ఆరోపించారు.
మాదాపూర్‌లోని సున్నం చెరువు దగ్గర దళిత బిడ్డలు ఇండ్లు కూలగొట్టావు. మహబూబ్‌నగర్‌లో కూలగొట్టావు. కానీ గండిపేట చెరువులో 18 ఎకరాల్లో కట్టిన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ చెరువును ఆక్రమించి ఫాంహౌజ్, గోల్ఫ్ కోర్స్ నిర్మిస్తే ఎందుకు కూలగొట్టవని సూటిగా ప్రశ్నించారు.
వారి కాంపాండ్ వాల్ ముట్టుకునే దమ్ముందా అని నిలదీశారు. పేదల ఇండ్లు కూల్చేందుకు రంగనాథ్‌కు, సీఎం బుల్డోజర్లు దొరుకుతవి. కానీ, వివేక్ ఇంటిని ముట్టుకోవడానికి దొరుకవా అని ప్రశ్నించారు. పేదలకు ఒక నీతి, మీడియా అధిపతులకు, పారిశ్రామిక వేత్తలకు ఇంకో నీతా అని నిలదీశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆలోచన చెయ్యాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చేందుకే హైడ్రా కూల్చివేతలకు తెరలేపిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

