వాడుకుని కట్టట్లేదు.. పెరిగిపోతున్న క్రెడిట్ కార్డుల మొండి బకాయిలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్రెడిట్ కార్డుల మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియో నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 14.30 శాతందాకా ఉన్నట్టు సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన అర్ధ వార్షిక ఆర్థిక సుస్థిరత నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో తేలింది.
- క్రెడిట్ కార్డ్ ఎన్పీఏలు పైపైకి
- ప్రభుత్వ బ్యాంకుల్లోనే అధికం
- ఆర్బీఐ నివేదికలో వెల్లడి
ముంబై, జూన్ 30: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్రెడిట్ కార్డుల మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియో నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 14.30 శాతందాకా ఉన్నట్టు సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన అర్ధ వార్షిక ఆర్థిక సుస్థిరత నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో తేలింది. 6 నెలల క్రితం ఇది 12.7 శాతంగానే ఉన్నది. అయితే ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. వీటిలో ఎంతకీ వసూలుకాని క్రెడిట్ కార్డుల బకాయిలు కేవలం 2.1 శాతంగానే ఉండటం గమనార్హం. మునుపు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ బ్యాంకులు క్రెడిట్ కార్డు బకాయిల వసూళ్లలో ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతున్నది.
జాగ్రత్తగా ఉండాల్సిందే..
సర్కారీ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల్లో క్రెడిట్ కార్డుల ద్వారా పెరుగుతున్నవి ఎక్కువగా ఉండటంపట్ల ఆర్బీఐ ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రకమైన అన్సెక్యూర్డ్ లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించింది. కాగా, ఓవరాల్గా ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 1.8 శాతంగా ఉంటే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2.8 శాతంగా ఉన్నాయి. నిజానికి మార్చిలో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు దశాబ్దాల కనిష్ఠాన్ని తాకుతూ 2.3 శాతానికి దిగొచ్చాయి. నిరుడు సెప్టెంబర్లో వచ్చిన ఎఫ్ఎస్ఆర్లో ఇవి 2.6 శాతంగా ఉన్నాయి. అయితే 2027 మార్చి నాటికి మళ్లీ పెరగవచ్చన్న అనుమానాల్ని ఆర్బీఐ కనబర్చింది. ఇక మొత్తం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థూల ఎన్పీఏల్లో 46 బ్యాంకులకు చెందినవే 98 శాతం ఉన్నట్టు ఆర్బీఐ ఈ సందర్భంగా వెల్లడించింది.
సైబర్ మోసాలపై..
ఆర్థిక రంగంలో సైబర్ సెక్యూరిటీ స్థితిస్థాపకతను పెంపొందించడానికి, ఆన్లైన్ మోసాలను అడ్డుకోవడానికి.. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత రక్షణ వ్యూహాలను, రిస్క్ కట్టడి పర్యవేక్షణల్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈ విషయంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆర్థిక సంస్థలకు సూచించింది. కాగా, ఇప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానమేనంటూ తమ తాజా నివేదికలో ఆర్బీఐ పేర్కొన్నది.
అయితే మే 30తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకింగ్ రుణాల వృద్ధి 4.9 శాతానికి పడిపోయిందని చెప్పింది. నిరుడు ఇదే సమయంలో 8.9 శాతంగా ఉన్నట్టు గుర్తుచేసింది. ‘ధరల స్థిరత్వం వంటి ఆర్థిక సుస్థిరత అంశాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి. ఆర్బీఐ, సెబీ తదితర ఆర్థిక రంగ రెగ్యులేటర్లు వినియోగదారుల రక్షణకు, పోటీని పెంచేందుకు కట్టుబడి ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక మార్పులు విధానపరమైన జోక్యాలకు సవాల్ విసురుతున్నాయి’ అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

