Pharma Courses | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులకు డిమాండ్ ఏటా పెరుగుతున్నది. ఈ కోర్సుల్లోని సీట్లు హాట్కేకులను తలపిస్తున్నాయి. తుది విడత కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగియగా, ఫార్మసీ కోర్సుల్లో 11,060 సీట్లకు 10,692(96.7)శాతం సీట్లు భర్తీఅయ్యాయి.
ఎప్సెట్ బైపీసీ విభాగంలో ఈ ఏడాది 82,163 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 17,201 మంది ఫార్మసీ కౌన్సెలింగ్కు హాజరుకాగా, 10,692 మంది సీట్లు దక్కించుకున్నారు. తుది విడత సీట్ల కేటాయింపు ముగిసిన తర్వాత 60 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. ఐదు కోర్సుల్లో కలిపి 368 సీట్లు మాత్రమే మిగిలాయి. సీట్లు పొందినవారు 12లోగా కాలేజీల్లో రిపోర్టుచేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఏ దేవసేన సూచించారు