కొవిడ్, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు పింక్ రిబ్బన్ మాస్క్ ప్రచారం

10 గ్రామాల్లో 20 వేల మాస్కుల పంపిణీకి ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్ణయం
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతోపాటు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ హైదరాబాద్ పింక్ రిబ్బన్ మాస్క్ క్యాంపెయిన్‌ను చేపట్టింది. ‘బంగారు తెలంగాణలో కొవిడ్-19 పింక్‌రిబ్బన్ మాస్క్’ పేరిట చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని 10 గ్రామాల్లో రెండు రోజుల్లో 20వేల మాస్కులను పం పిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బుధవారం ఇంబ్రహీంపూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్‌ను దత్తత తీసుకొని ఆరేండ్లుగా గ్రామ అభివృద్ధికి కృషిచేస్తున్న డాక్టర్ పీ రఘురామ్‌ను అభినందించారు. పింక్ రిబ్బన్ మాస్క్ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయనున్న మాస్కులను మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)తో తయారు చేయించడం హర్షణీయమన్నారు. డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలోని 90 గ్రామాల్లో మాస్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సాయమందించదల్చుకున్న దాతలు 9100903781 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Breast cancer
- Cancer
- corona
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

