Autodrivers | ఆటోడ్రైవర్ల భిక్షాటన.. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం
Autodrivers | మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) కల్పించడంపై ఆటోడ్రైవర్లు(Autodrivers) బుధవారం హనుమకొండ(Hanumakonda) వేయిస్తంభాల దేవాలయ సమీపంలో భిక్షాటనతో నిరసన తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జనవరి 3 : మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) కల్పించడంపై ఆటోడ్రైవర్లు(Autodrivers) బుధవారం హనుమకొండ(Hanumakonda) వేయిస్తంభాల దేవాలయ సమీపంలో భిక్షాటనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ల సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకుడు ఇసంపెల్లి సంజీవ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసి 25 రోజులు కావస్తోందని, దీంతో ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటోడ్రైవర్లకు వెంటనే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించడంలేదని భిక్షాటన ద్వారా నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు మడికొండ బాబు, కంకోట్ల జయరాం, పసునూరి బాబు, మంద శ్రీధర్‌రెడ్డి, చీకటి కుమార్, బొల్లం సంజీవ, గుండా రమేశ్, సముద్రాల సాయిలు, పసునూరి శ్రీనివాస్, ఖాజాపాషా, మాషుక్, రాజు, హైమద్, భూక్యానాయక్, పద్మారావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

