హ్యాట్రిక్ సీఎం కేసీఆరే!
తెలంగాణ ఆటో రిక్షా కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పడంపై గ్రేటర్ హైదరాబాద్ ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆరేనని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఆటోలు నడుపుతూ కారు గెలుపునకు కృషి చేస్తామని స్పష్టంచేస్తున్నారు.
- కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాష్ర్టానికి చేసిందేమీ లేదు
- సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను సమానంగా ఆదుకున్నారు
- ఫిట్నెస్, సర్టిఫికెట్ చార్జీలు మాఫీ హామీకి కృతజ్ఞతలు
- ముఖ్యమంత్రికి జీవితాంతం మేమంతా రుణపడి ఉంటాం
- ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకొని తీరుతాం
- గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు స్పష్టం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆటో రిక్షా కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పడంపై గ్రేటర్ హైదరాబాద్ ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆరేనని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఆటోలు నడుపుతూ కారు గెలుపునకు కృషి చేస్తామని స్పష్టంచేస్తున్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో సామాన్యుల బతుకులకు భరోసా లేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా కష్టకాలంలో మోటార్ వాహన పన్ను రద్దు, డ్రైవర్ కం ఓనర్, రూ.5 లక్షల ప్రమాదబీమాతో ఆదుకోగా, తాజాగా ఆటోల ఫిటెనెస్, సర్టిఫికెట్ చార్జీలను మాఫీ చేస్తామని ప్రకటించడం కేసీఆర్ మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు. తక్కువ ఆదాయమున్న ప్రతి ఆటో డ్రైవర్‌కు సాయం చేసే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కారే గెలుస్తున్నది
ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని ప్రత్యేకంగా పరిగణించి సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారు. ఇంతకన్న గొప్ప వ్యక్తి ఎవరుంటరు. కాంగ్రెస్, బీజేపీలు ఏనాడూ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించిన పాపానపోలేదు. సీఎం కేసీఆర్ అలా కాదు, మా కష్టాలు తెలుసుకొని అన్ని విధాల ఆదుకుంటున్నారు. రూ.5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నారు.
– శాతం రమేశ్, ఆటో డ్రైవర్
కేసీఆర్ మాట ఇస్తే తప్పరు
ఆటోలపై తెలంగాణలో పన్ను లేదు. దీనికి తోడు ఫిట్నెస్ చార్జీల మాఫీ హామీ గొప్ప విషయం. సంక్షేమ పథకాలన్నింటినీ పొందుతున్నాం. వాటికి తోడు ఆటోలతో వచ్చే ఆదాయం మా జీవితాలకు భరోసానిస్తున్నది. కేసీఆర్ సీఎం అవడం కోసం నిరంతరం పనిచేస్తాం.
-తాటికాయల కుమార్, ఆటో డ్రైవర్
కేసీఆర్ పాలనను విదేశీయులు మెచ్చుకున్నరు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇప్పడు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. చాలామంది విదేశీయులు హైదరాబాద్‌లో పర్యటించేందుకు వస్తుంటారు. వారంతా కొన్నిసార్లు మా ఆటోలు ఎక్కుతుంటారు. వారు సీఎం కేసీఆర్ పాలన బాగుందంటూ మెచ్చుకుంటారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, సుందరీకరణ పర్యాటక ప్రదేశాలు, గొప్పగొప్ప చారిత్రక కట్టడాలు ఇలా ఎన్నింటోనో వారంతా చూస్తూ ఆనందిస్తారు. సీఎం కేసీఆర్ పాలన తెలంగాణకు అత్యంత అవసరం.
-కర్నే రామాంజనేయులు, ఆటో డ్రైవర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

